బుధవారం 03 జూన్ 2020
National - Apr 08, 2020 , 23:27:15

పీఎం కేర్స్ కు నిధులను సమీకరించిన చెస్ ప్లేయర్స్

పీఎం కేర్స్ కు నిధులను సమీకరించిన చెస్ ప్లేయర్స్

 

  దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక చెస్ క్రీడాకారులు వినూత్న మార్గంలో తమ క్రీడకు ప్రచారం కల్పిస్తూనే, అదే సమయంలో పీఎం కేర్స్ ఫండ్ కు నిధులనూ సమీకరించారు.
 అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్, ఏడుగురు అంతర్జాతీయ మాస్టర్లు, జాతీయ చెస్ చాంఫియన్స్, ఔత్సాహిక చదరంగ ఆటగాళ్లు ఒకే తాటిపైకి రావడంతో పాటుగా ఏప్రిల్ 7వ తేదీన చెస్ స్టర్ గ్రూప్ మార్గనిర్దేశకత్వంలో ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు.దేశవ్యాప్తంగా ఉన్న చెస్ ప్రేమికులకు తెరువబడిన ఈ పోటీలో పాల్గొనేందుకు ఎలాంటి ఫీజునూ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, పాల్గొనేఅభ్యర్థులను తమకు తోచిన మేర పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం అందించాల్సిందిగా కోరారు. కోవిడ్-19 మహమ్మారితో పోరాడేందుకు ఈ నిధులు తోడ్పడనున్నాయి. తాము పీఎంకేర్స్ ఫండ్ కు నిధులు పంపామనపంపిస్తే చాలు, ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా ముంబై, నోయిడా, హైదరాబాద్, నాగ్ పూర్ తదితర నగరాల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ టోర్నమెంట్ ను www.Lichess.org  ( చెస్ కు ప్రాచుర్యం కల్పించేందుకు అంతర్జాతీయ లాభాపేక్ష లేని చదరంగ వేదిక)పై నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న 60 మంది చదరంగ ఆటగాళ్లు, ఔత్సాహికులు 1,05,000 రూపాయలను పీఎం కేర్స్ ఫండ్ కు అందజేశారు.(16 సంవత్సరాలు, అండర్ 17 నేషనల్ చెస్ చాంఫియన్, 2018), ఆదర్శ్ త్రిపాఠీ ,యాష్ శ్రీవాస్తవ (14 - 17 సంవత్సరాలు, అంతర్జాతీయ రేటింగ్ కలిగిన చదరంగ ఆటగాళ్లు) ఈ సందర్భంగా నిర్వాహకులు వేదాంత్ పనేసర్ మాట్లాడుతూ "వీలైనంత ఎక్కువగా మేము నిధులను సమీకరించి, చిన్నమొత్తమే అయినా పీఎం కెర్స్ కు అందించాలనుకున్నాం. మా ప్రయత్నంలో ఎంతోమంది మాకు మద్దతునందించారు'' అని అన్నారు. తమ విద్యార్థులు ఈ మహోన్నత కార్యక్రమాన్ని ఆరంభించడం పట్ల గర్వంగా ఉన్నానని చెస్ కోచ్ వఖీల్ అక్తర్ అన్నారు. ఈ టోర్నమెంట్లో 80 మందికి పైగా పాల్గొనగా, తెలంగాణాలోని హైదరాబాద్ నగరానికి చెందిన ఐఎం రవితేజ ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచారు. బహుమతులను దాదాపు 20 మందికి అందించారు. ఈ మొత్తాలను టీనేజ్ ఆర్గనైజర్ల పాకెట్ మనీ నుంచి సమకూర్చారు. 


logo