బుధవారం 03 జూన్ 2020
National - Apr 08, 2020 , 23:05:51

కరోనా కట్టడిలో టీటీడీ ముందడుగు

కరోనా కట్టడిలో టీటీడీ ముందడుగు


కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఇప్పటికే అనేక ముందస్తు చర్యలు తీసుకున్న టీటీడీ ఆయుర్వేద మందుల తయారీతో మరో అడుగు ముందుకు వేసింది. జేఈఓ  శ్రీ బసంత్ కుమార్ ఆదేశం మేరకు ఎస్ వీ ఆయుర్వేద కళాశాల,  ఎస్ వీ ఆయుర్వేద ఆసుపత్రి, ఆయుర్వేద ఫార్మశీ సంయుక్త ఆధ్వర్యంలో 5 రకాల మందులను తయారు చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మంగళవారం సాయంత్రం జేఈఓ బసంత్ కుమార్ తన చాంబర్ లో ఈ మందులను విడుదల చేశారు. ఈ మందులు వాడాల్సిన విధానం,  వీటివల్ల కరోనా వ్యాధి బారిన పడకుండా ఎలా కాపాడుకోవచ్చు అనే వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో  పేద ప్రజలకు  అన్నప్రసాదం తయారీ కోసం పని చేస్తున్న వంటశాల ( క్యాంటీన్) ల సిబ్బందికి మొదటగా వీటిని అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ తరువాత విడతల వారీగా టీటీడీ లోని అన్ని విభాగాల సిబ్బందికి ఈ మందులను ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


logo