గురువారం 09 జూలై 2020
National - Apr 07, 2020 , 22:52:09

ఏపీ దేశంలో ఏడో స్థానం

ఏపీ దేశంలో ఏడో స్థానంఏ.పి.లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. 303 కి చేరాయి. అత్యధికంగా కర్నూలు లో 74 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో సగం కర్నూలు, నెల్లూరు,గుంటూరు జిల్లాల్లో 24గంటల వ్యవధిలో 45 కేసుల నమోదు కాగా. కరోనా పరీక్షా కేంద్రాల  సామర్థ్యం పెంచడానికి అక్కడి సర్కారు చర్యలు చేపడుతున్నది.
అందులో భాగంగా విశాఖ,గుంటూరు,కడప నగరాల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు.
ప్రాథమిక స్థాయిలోను పరీక్షల నిర్వహణ కు అనుమతి ఇచ్చారు.
రాష్ట్రానికి రానున్న 240 పరికరాలు రానున్నాయి. ఒక్కో పరికరంతో రోజుకు 20నమూనాలు పరీక్షించి అవకాశం ఉన్నది.
జిల్లాల వారీగా కేసులు...
కర్నూలు74,నెల్లూరు42,గుంటూరు 32,కృష్ణా29,కడప 27, ప్రకాశం 24,ప.గో.21,విశాఖ 20,చిత్తూరు17,తూ. గో.11,అనంతపురం6 కేసులు నమోదయ్యాయి.


logo