గురువారం 02 జూలై 2020
National - Apr 07, 2020 , 00:22:18

కోవిడ్ అంతం కోసం కేంద్రం సరికొత్త ప్రణాళిక

కోవిడ్ అంతం కోసం కేంద్రం సరికొత్త ప్రణాళిక


 కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్తప్లాన్ ను రూపొందించిం ది. వైరస్ తీవ్రంగా వ్యాపించిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య పూర్తిగా నిలిచిపోయే వరకూ కఠినంగా వ్యవ హరించాలని నిర్ణయించింది. అందుకోసం ‘అగ్రెసివ్ కంటైన్మెంట్ స్ట్రాటజీ’తో 20 పేజీల డాక్యుమెంట్ ను కేంద్రం సిద్ధం చేసింది. వైరస్ కు హాట్ స్పాట్లు గా మారిన ప్రాంతాల్లో నెల రోజుల పాటు ఆంక్షలు కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అనేక రాష్ట్రాల్లో పలు చోట్ల కరోనా వైరస్ కస్ల్టర్లు ఏర్పడ్డాయని, వీటి వల్ల చాలా ముప్పు పొంచి ఉందని కేంద్రం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నది. వైరస్ క్ల స్టర్లు గా మారిన ప్రాంతాల్లో4 వారాల పాటు ఒక్క కొత్త కేసు నమోదు కాకుండా ఆగిపోయేంత వరకూ కఠినంగా ఉండాలని ఈ డాక్యుమెంట్ లో కేంద్రం పేర్కొన్నది. దీనిని హెల్త్ మినిస్ట్రీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. కరోనా వైరస్ కూడా హెచ్1ఎన్1 ఇన్ ఫ్లుయెంజా మాదిరిగా దేశంలోని కొన్నిప్రాంతా ల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోందని అంచనాకు వచ్చింది. అందుకే హాట్ స్పాట్లు , ఆయా ప్రాంతాలకు తగిన ట్లుగా వేర్వేరు వ్యూహాలతో దీనిని అంతం చేయాలని నిర్ణయించింది. 


logo