గురువారం 04 జూన్ 2020
National - Apr 06, 2020 , 15:45:01

గూగుల్‌లో ఆహార కేంద్రాలు, నైట్ షెల్ట‌ర్లు

గూగుల్‌లో ఆహార కేంద్రాలు, నైట్ షెల్ట‌ర్లు

క‌రోనాతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌గా ప్ర‌జ‌లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌య్యారు. కానీ సొంత నివాసం అంటూ లేని చాలామంది ఎక్క‌డ ఉండాలో, ఏం తినాలో తెలియ‌క ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. దాంతో ప్ర‌ముఖ నెట్ సెర్చింగ్ సంస్థ గూగుల్ ఈ స‌మ‌స్య‌ను కొంత‌వ‌ర‌కు తీర్చింది. సోమ‌వారం నుంచి గూగుల్ మ్యాప్స్ ద్వారా  దేశంలోని ఆహార కేంద్రాలు, నైట్ షెల్ట‌ర్ల వివ‌రాల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. గూగుల్ మ్యాప్స్ తోపాటు సెర్చ్‌, గూగుల్ అసిస్టెంట్‌లో కూడా ఈ వివ‌రాలు ల‌భిస్తాయ‌ని తెలిపింది. దేశంలోని 30 న‌గ‌రాల్లోని ఫుడ్ సెంట‌ర్లు, నైట్ షెల్ట‌ర్ల వివ‌రాలు అందుబాటులో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. అవ‌స‌ర‌మైన‌వారు ఫుడ్‌షెల్ట‌ర్స్ ఇన్ లేదా నైట్ షెల్ట‌ర్స్ ఇన్ అని వెద‌కాల‌ని సూచించింది.  


logo