బుధవారం 03 జూన్ 2020
National - Apr 06, 2020 , 14:58:51

కంపెనీల‌కు ఐఐటీ డిల్లీ విజ్ఞ‌ప్తి

కంపెనీల‌కు ఐఐటీ డిల్లీ విజ్ఞ‌ప్తి

దేశంలోని ఐఐటీలు స‌హా ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యా సంస్థ‌ల్లోని విద్యార్థుల‌కు ఉద్యోగాలిచ్చేందుకు ముందుకొచ్చిన కంపెనీలు మ‌న‌సు మార్చుకొంటున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై ఐఐటీ ఢిల్లీ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్‌రావు ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. క‌రోనా కార‌ణంగా ఏర్ప‌డిన ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న తెలివైన విద్యార్థుల‌ను నిరుత్సాహ‌ప‌ర్చ‌వ‌ద్ద‌ని కంపెనీల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌స్తుతం ఐఐటీల్లో నాలుగో సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థుల‌కు గ‌తేడాది డిసెంబ‌ర్‌- ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల‌ల్లో ప‌లు కంపెనీలు క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల ద్వారా ఉద్యోగ ఆఫ‌ర్లు ఇచ్చాయి. వారికి వ‌చ్చే జూలై- ఆగ‌స్టు నెల‌ల్లో మ‌రోసారి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉంది. 

ప్ర‌స్తుత సంక్షోభం కార‌ణంగా చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగుల‌నే తొల‌గించే ఆలోచ‌న‌లో ఉండ‌టంతో ఐఐటీ, ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీల విద్యార్థుల‌కు ఇచ్చిన ఆఫ‌ర్ల‌ను వెన‌క్కు తీసుకొనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై స్పందించిన రామ్‌గోపాల్ రావు లాక్‌డౌన్ కార‌ణంగా వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం కొంచం ఆల‌స్యంగా జూన్‌- జూలైలో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశ‌ముంద‌ని చెప్పారు. కంపెనీల్లో ఇంట‌ర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థుల‌కు కొంచె ఆల‌స్య‌మైనా ఉద్యోగాలు ఇవ్వాల‌ని కోరారు. ఐఐటీ ఢిల్లీ నియ‌మం ప్ర‌కారం క్యాంప‌స్ ప్లేస్‌మెంట్‌లో ఒక ఉద్యోగానికి ఎంపికైనా విద్యార్థి మ‌రో ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించే అవ‌కాశం లేద‌ని తెలిపారు. భార‌త ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ విధానం విదేశాల్లోని ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌తో పోల్చితే భిన్నంగా ఉంటుంద‌ని, ఈ విష‌యాన్ని కంపెనీలు గ‌మ‌నించాల‌ని కోరారు. 


logo