ఆదివారం 07 జూన్ 2020
National - Apr 06, 2020 , 14:23:36

త‌మిళ‌నాడులో ముగ్గురు వ్య‌క్తులు మృతి

త‌మిళ‌నాడులో ముగ్గురు వ్య‌క్తులు మృతి

దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ద్యంషాపులు కూడా మూసివేయ‌టంతో మందుబాబులు నానాక‌ష్టాలు ప‌డుతున్నారు. మందుకు బానిస‌లైన మ‌రికొంద‌రు ప్ర‌మాద‌క‌ర‌మైన ఇత‌ర ద్ర‌వాల‌ను సేవించి ప్రాణాల‌మీదికి తెచ్చుకున్నారు. త‌మిళ‌నాడులోని చెంగ‌ల్‌ప‌ట్టులో మ‌ద్యం ల‌భించ‌క కొంద‌రు ఆదివారం పెయింట్‌, వార్నిష్ తాగి తీవ్ర అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు. దాంతో వారిని వెంట‌నే ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. మృతుల‌ను శివ‌శంక‌ర్‌, ప్ర‌దీప్‌, శివ‌రామ‌న్‌గా గుర్తించారు. మ‌ద్యం ల‌భించక‌పోవ‌టంతో వీరు పెయింట్‌లో వార్నిస్ క‌లుపుకొని సేవించార‌ని అధికారులు తెలిపారు. 


logo