శుక్రవారం 29 మే 2020
National - Apr 06, 2020 , 14:08:22

కొన్నిచోట్ల స్టేజ్ 3 మొద‌లైంది: ఎయిమ్స్ డైరెక్ట‌ర్‌

కొన్నిచోట్ల స్టేజ్ 3 మొద‌లైంది: ఎయిమ్స్ డైరెక్ట‌ర్‌

క‌రోనా వ్యాధి వ్యాప్తిలో ఆందోళ‌నక‌ర‌మైన మూడో ద‌శ దేశంలో కొన్నిచోట్ల ప్రారంభమైందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా సోమ‌వారం తెలిపారు. ఈ ద‌శ‌లో క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ ద్వారా వైర‌స్ వేగంగా వ్యాపిస్తుంది. ముంబైలాంటి కొన్ని ప్రాంతాల్లో వైర‌స్ వేగంగా వ్యాపిస్తున్న‌ద‌ని, ఇది మూడోద‌శ‌ను సూచిస్తున్న‌ద‌ని గులేరియా తెలిపారు. అయితే దేశంలో ఎక్కువ భాగం స్థానిక వ్యాప్తి (స్టేజ్ 2) ద‌శ‌లోనే ఉంద‌ని పేర్కొన్నారు.  వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న‌చోట వెంట‌నే నియంత్ర‌ణ చ‌ర్య‌లు తీసుకుంటే ప్రమాదాన్ని నివారించ‌వ‌చ్చ‌ని తెలిపారు. త‌బ్లిగి జ‌మాత్ స‌మావేశాల‌కు హాజ‌రైన‌వారిని త్వ‌ర‌గా గుర్తించ‌టం ఇప్పుడు చాలా ముఖ్య‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యంలో వైద్యుల‌కు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. 


logo