ఆదివారం 07 జూన్ 2020
National - Apr 06, 2020 , 10:47:12

సుప్రీంకోర్టులో న‌ర్సుల సంఘం పిటిష‌న్‌

సుప్రీంకోర్టులో న‌ర్సుల సంఘం పిటిష‌న్‌

కోవిడ్‌-19 రోగుల‌కు వైద్య సేవ‌లు అందిస్తున్న న‌ర్సులు, ఇత‌ర వైద్య‌సిబ్బంది ఆరోగ్యం అత్యంత ప్ర‌మాదంలో ఉంద‌ని, ఈ వ్యాధిపై ప్ర‌భుత్వం నేష‌న‌ల్ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్‌ను సిద్ధం చేయ‌క‌పోవ‌టం ఇంకా ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌ని కేర‌ళ కేంద్రంగా ప‌నిచేస్తున్న యునైటెడ్ న‌ర్సెస్ అసోసియేష‌న్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ సంఘంలో 3.8 ల‌క్ష‌ల మంది న‌ర్సులు స‌భ్యులుగా ఉన్నారు. కోవిడ్‌-19 కేసులు బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌డు ముందుండి స్పందించేది ఆరోగ్య కార్య‌క‌ర్త‌లే. దాంతో వారి ఆరోగ్యం ఇప్పుడు అత్యంత ప్ర‌మాదంలో ఉంది. వారికి వ్యాధి సోకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. వ్యాధి సోకే ప్ర‌మాదంతోపాటు సుదీర్ఘ‌మైన ప‌నివేళ‌లు, మాన‌సిక వ‌త్తిడి, అల‌స‌ట‌, వృత్తిప‌ర‌మైన క‌ష్టాలు, శారీర‌క‌, మాన‌సిక హింస త‌దిత‌ర తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల‌ను వైద్య సిబ్బంధి ఎదుర్కొంటున్నార‌ని  సంఘం త‌న పిటిష‌న్‌లో పేర్కొంది. 

క‌రోనా రోగుల‌కు వైద్యం అందిస్తున్న సిబ్బందికి స‌రైన ర‌క్ష‌ణ కిట్లు కూడా ప్ర‌భుత్వం అందించ‌టంలేదని అసోసియేష‌న్ న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. స‌రిప‌డా రోగ నిర్థార‌ణ కిట్లు లేవ‌ని, ఈ వ్యాధిపై సిబ్బంధికి త‌గిన శిక్ష‌ణ కూడా ఇవ్వ‌లేద‌ని పేర్కొంది. క‌రోనా రోగుల‌కు సేవ‌ల అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ ప్యాకేజీ మ‌రింత విస్త‌రించి వైద్య‌సిబ్బందికి మేలు చేసేలా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరింది.


logo