శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 01, 2020 , 17:28:05

మూర్ఖపు సలహా.. చెత్త నిర్ణయం

మూర్ఖపు సలహా.. చెత్త నిర్ణయం

దేశంలోని చిన్నమొత్తాల పొదుపులపై వడ్డీరేటును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది మూర్ఖులు ఇచ్చిన సలహాపై తీసుకున్న చెత్త నిర్ణయమని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 4శాతంకంటే తక్కువగానే ఉందని, ఇప్పుడు ఆలోచించాల్సింది జీడీపీ గురించి కాదని ప్రజల ప్రాణాల గురించి అని పేర్కొన్నారు. ‘కొన్నిసార్లు ప్రభుత్వం మూర్ఖపు సలహాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది కూడా ఓ మూర్ఖపు సలహానే. చిన్నమొత్తాలు, పీపీఎఫ్‌లపై వడ్డీరేటును తగ్గించటం సాంకేతికంగా సరైనదే కావచ్చు. కానీ ఈ సమయంలో కచ్చితంగా ఓ చెత్త నిర్ణయమే’ అని బుధవారం ట్వీట్‌ చేశారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ప్రజలు ఆదాయంకోసం తమ పొదుపులపై వచ్చే వడ్డీపై ఆధారపడుతారని తెలిపారు.


logo