శుక్రవారం 29 మే 2020
National - Mar 31, 2020 , 16:24:03

టీవీ చానళ్లు కూడా ఫ్రీగా ఇవ్వాలి : కేబుల్‌ ఆపరేటర్ల వినతి

టీవీ చానళ్లు కూడా ఫ్రీగా ఇవ్వాలి :  కేబుల్‌ ఆపరేటర్ల వినతి

కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించటంతో ఇంటింటికి తిరిగి కేబుల్‌ బిల్లులు వసూలుచేయలేకపోతున్నామని కేబుల్‌ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తంచేశారు. అందువల్ల వచ్చే రెండు నెలలపాటు పేచానళ్లు తమ ప్రసారాలను ఫ్రీగా ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కేబుల్‌ ఆపరేటర్ల సంఘం నేతలు కేంద్ర సమాచార ప్రసార శాఖతోపాటు ట్రాయ్‌కు విజ్ఞప్తి చేశారు. మనుషుల కదలికలపై తీవ్రమైన ఆంక్షలు ఉన్నందున నెలవారీ చార్జీలు వసూలు చేయటం సాధ్యం కావటంలేదని కేబుల్‌ ఆపరేటర్లసంఘం నేత డీజీవీపీ శేఖర్‌ తెలిపారు. అందువల్ల పే చానళ్లు అన్ని రెండు నెలలపాటు ఫ్రీగా తమ ప్రసారాలు అందించాలని కోరారు. 


logo