గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 09:18:56

తిరుమ‌ల‌లో 28 నుంచి సంగీత కార్య‌క్ర‌మాలు ర‌ద్దు

తిరుమ‌ల‌లో 28 నుంచి సంగీత కార్య‌క్ర‌మాలు ర‌ద్దు

తిరుమల: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా వైర‌స్ రోజురోజుకు వేగంగా విస్త‌రిస్తుండ‌టంతో.. ఈ నెల 28 (శ‌నివారం) నుంచి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సంగీత కార్యక్రమాలను ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. షెడ్యూల్‌ ప్రకారం ఇతర రాష్ట్రాల కళాకారులు నాదనీరాజనం వేదికపై కార్యక్రమాలు నిర్వహిం చాల్సి ఉండ‌గా ఇప్ప‌టికే రద్దు చేశారు.

కానీ, నాదనీరాజనం వేదిక ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో ఐదు రోజులుగా స్థానిక కళాకారులతోనే కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. తాజాగా 144 సెక్షన్‌ అమల్లో ఉండటంతో స్థానిక క‌ళాకారులు కూడా తిరుమ‌త‌ల‌కు చేరుకోలేకపోతున్నారు. దీంతో శుక్రవారం గాత్ర కచేరి నిర్వహించి శనివారం నుంచి సంగీత కార్య‌క్ర‌మాల‌ను నిలిపివేయనున్నట్టు తెలిసింది. కాగా, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే శ్రీవారి దర్శనాలను రద్దు చేసి ఘాట్‌రోడ్లను మూసేశారు.


logo