సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 01:35:13

కుప్పిగంతులు వేయించిన కానిస్టేబుల్‌పై వేటు

కుప్పిగంతులు వేయించిన కానిస్టేబుల్‌పై వేటు

లక్నో: లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వ్యక్తులకు ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలీసు అనుచిత శిక్ష విధించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పని చేసేందుకు వలస వెళ్లిన కార్మికులు యూపీలోని బదౌన్‌ జిల్లాకు తిరిగి వచ్చారు. వారిలో కొందరు వ్యక్తులు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి బయటకు వచ్చినందుకు వారిని ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కుప్పిగంతులు వేయించాడు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నది. ఈ సంగతి బయటకు రాగానే సంబంధిత కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఎస్సెప్పీ అశోక్‌ కుమార్‌ త్రిపాఠి వెల్లడించారు. 

కూరగాయల బండ్లను ధ్వంసం చేసిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

ఢిల్లీలో లాక్‌డౌన్‌ సందర్భంగా కూరగాయల బండ్లను ధ్వంసంచేసిన ఒక కానిస్టేబుల్‌ను గురువారం సస్పెండ్‌ చేశారు. ఆనంద్‌ పర్బత్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్‌ రాజ్‌బీర్‌.. బుధవారం మూడు కూరగాయల బండ్లను తలకిందులుగా పడేస్తూ బెదిరింపులకు దిగాడు. దీంతో అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరాలు అందించేవారితో, వైద్యులతో మర్యాదగా ప్రవర్తించాలంటూ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.logo