ఆదివారం 29 మార్చి 2020
National - Mar 25, 2020 , 07:44:03

మెడిక్స్ ఉత్ప‌త్తిలో రైల్వే

మెడిక్స్   ఉత్ప‌త్తిలో రైల్వే

క‌రోనా క‌ట్ట‌డికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఎలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్తితిని అయినా ఎదుర్కొనేందుకు అన్ని ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఎలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు త‌మ ప‌రిధిలోని వ‌న‌రుల‌ను స‌మీక‌రిస్తున్నాయి. ఇందులో భాగంగా  ద‌వాఖాన‌ల్లో రోగుల‌కు అత్య‌వ‌స‌ర‌మైన బెడ్లు, స్ర్టెచ‌ర్లు, శానిటైజ‌ర్లు, మెడిక‌ల్ ట్రాలీలు త‌దిత‌ర వ‌స్తువుల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు  రైల్వేశాఖ స‌మాయ‌త్త‌మైంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న రైల్వే ఉత్ప‌త్తి యూనిట్ల‌లో ధ‌వాఖాన‌ల్లో అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ఆయా యూనిట్ల జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ల‌కు రైల్వేబోర్డు ఆదేశాలు జారీ చేసింది. రోగుల‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను భారీ మొత్తంలో ఉత్ప‌త్తి చేసేందుకు గ‌ల అవ‌కాశాల‌ను త‌క్ష‌ణం ప‌రిశీలించాల‌ని, ఉత్ప‌త్తికి సంబంధించిన స‌మాచారాన్ని ఎప్పిటిక‌ప్పుడు బోర్డుకు తెలుపాల‌ని ఆదేశించింది. ఎలాంటి వ‌స్తువుల‌ను ఉత్ప‌త్తి చేయాలో రైల్వే ప్రిన్సిప‌ల్ మెడిక‌ల్ డైరెక్ట‌ర్స్‌ను సంప్ర‌దించాల‌ని సూచించింది. 

కోవిడ్ వైర‌స్ నియంత్ర‌ణ‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా రైలు స‌ర్వీసుల‌ను నిలిపివేసిన‌ప్ప‌టికీ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు వేత‌నాలు య‌థావిధిగా చెల్లిస్తామ‌ని బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ నిర్ణ‌యం క‌నీసం 50000 మంది ఉద్యోగుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని పేర్కొంది. `


logo