గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 17:41:13

ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనా అనుమానితులు పరార్‌

ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనా అనుమానితులు పరార్‌

మహారాష్ట్ర : కరోనా అనుమానిత ఐదుగురు పేషెంట్లు నాగపూర్‌లోని మయో ఆస్పత్రి నుంచి శుక్రవారం రాత్రి తప్పించుకు పారిపోయారు. వీరిలో ఒకరికి కోవిడ్‌-19 నెగిటివ్‌గా తేలింది. మరో నలుగురి రిపోర్టులు రావాల్సి ఉంది. వీరి పరారీపై సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తులను వెతికి తిరిగి ఆస్పత్రిలో చేర్చారు. నాగపూర్‌ తెహసిల్‌ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ సూర్యవంశీ తెలిపిన వివరాల ప్రకారం... అనుమానిత ఐదుగురు వ్యక్తులు చిరుతిళ్లు తినేందుకు వార్డునుంచి బయటకు వెళ్లారు. కానీ తిరిగి వార్డుకు రాలేదు. ఆస్పత్రి సిబ్బంది సమాచారంతో వారిని వెతికి పట్టుకుని తిరిగి ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం నాడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే మాట్లాడుతూ.. ముంబయి, నవీ ముంబయి, థానే, నాగ్‌ఫూర్‌ తదితర ప్రాంతాల్లోని అన్ని సినిమాహాళ్లు, జిమ్స్‌, స్విమ్మింగ్‌ ఫూల్స్‌ను ఈ నెల 30వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.


logo