శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 14:56:45

భారీగా పతనమైన స్టాక్‌మార్కెట్లు

భారీగా పతనమైన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌ : స్టాక్‌ మార్కెట్లను కరోనా భయం వెంటాడుతోంది. కరోనాకు తోడు క్రూడ్‌ ఆయిల్‌ ధరల పతనం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు అతి భారీగా పతనమయ్యాయి. 3,100 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్‌, 930 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు 52 వారాల కనిష్ట స్థాయిలో ట్రేడవుతున్నాయి. 7-8 శాతానికి పైగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు నష్టపోయాయి. 10 శాతానికి పైగా బ్యాంకు నిఫ్టీ నష్టపోయింది. 

ఇటు గ్లోబల్ మార్కెట్ల ప్రభావం.. ఆసియా మార్కెట్లపై పడింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఇవాళ సెన్సెక్స్‌, నిఫ్టీ గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌ తో మదుపర్లు కుదేలయ్యారు. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ఫ్లాట్‌ లో కొనసాగుతుండగా.. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్రిటానియా, బజాజ్‌ ఫినాన్స్‌, హీరో మోటార్‌కార్ప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


logo