శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 02:54:42

కోటలను రక్షించుకుందాం

కోటలను రక్షించుకుందాం
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

న్యూశాయంపేట: రాచకొండ, దేవరకొండ కోటల పరిరక్షణతో భావితరాలకు చరిత్రను అందించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం హన్మకొండ వెలమ సంక్షేమ భవనంలో ప్రముఖ రచయిత డాక్టర్‌ పేరాల సుధాకర్‌రావు రచించిన ‘హిస్టరీ ఆఫ్‌ తెలుగు కింగ్‌ డమ్‌ రాచకొండ, దేవరకొండ’ పుస్తకాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రాచకొండ, దేవరకొండ కోటల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. భారత ఉపఖండాన్ని పాలించిన తొలి మహిళ రుద్రమదేవి అయితే, చరిత్రకారులు.. రజియా సుల్తానాను మొదటి పాలకురాలిగా పేర్కొని చరిత్రను వక్రీకరించారని అన్నారు. అనంతరం రచయిత డాక్టర్‌ పేరాల సుధాకర్‌రావును సన్మానించారు. 

logo