ఆదివారం 29 మార్చి 2020
National - Mar 03, 2020 , 14:41:15

విప‌క్షాల‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ వార్నింగ్‌

విప‌క్షాల‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ వార్నింగ్‌

హోళీ త‌ర్వాత ఢిల్లీ అల్ల‌ర్ల‌పై చ‌ర్చ 

హైద‌రాబాద్‌:  లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా ఇవాళ విప‌క్ష స‌భ్యుల‌పై సీరియ‌స్ అయ్యారు. ప్లకార్డులు ప‌ట్టుకుని స‌భ‌లోకి రావ‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.  ప్లకార్డుల‌తో స‌భ‌ను న‌డిపిస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.  ఢిల్లీ అల్ల‌ర్ల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి. ఆ స‌మ‌యంలో కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. దేశంలో శాంతి, ఐక్య‌మ‌త్యాన్ని నెల‌కొల్పాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చాని మంత్రి అన్నారు. అయినా విప‌క్ష స‌భ్యులెవరూ వినిపించుకోలేదు.  కాంగ్రెస్ ఎంపీలు అరుపులు, కేక‌లు చేస్తూ స‌భ కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ స‌మ‌యంలో స్పీక‌ర్ ఓం బిర్లా.. విప‌క్ష స‌భ్యుల‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ప్లకార్డులు, బ్యాన‌ర్ల‌తో స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌నుకుంటున్నారా,  దీన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారా, మీ పార్టీ దీన్ని ప్ర‌క‌టిస్తుందా అని స్పీక‌ర్ బిర్లా.. విప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు.  విప‌క్ష స‌భ్యులు ఎంత‌కీ విన‌క‌పోవ‌డంతో.. స‌భ‌ను 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. మ‌రో వైపు రాజ్య‌స‌భ‌లోనూ ఢిల్లీ అల్ల‌ర్లు ప్ర‌తిధ్వ‌నించాయి.  దీంతో వెంక‌య్య‌నాయుడు స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వాయిదా వేశారు.  హోళీ త‌ర్వాత ఢిల్లీ అల్ల‌ర్ల‌పై చ‌ర్చ చేప‌ట్టేందుకు స్పీక‌ర్ ఓం బిర్లా సుముఖ‌త వ్య‌క్తం చేశారు. logo