గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 13:27:59

పసిపాప కోసం!

పసిపాప కోసం!

న్యూఢిల్లీ: సినిమాను తలపించే కథ ఇది. మూడేండ్ల చిన్నారి కోసం తల్లిదండ్రుల మధ్య నడిచిన పోరులో పలు నాటకీయ మలుపులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీకి చెందిన అమన్‌ లోహియా ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడు. భార్య కిరణ్‌ కౌర్‌ చర్మవ్యాధి నిపుణురాలు. వీరికి మూడేండ్ల కుమార్తె రైనా ఉన్నది. విభేదాల కారణంగా విడిపోయిన ఈ జంట.. కుమార్తె సంరక్షణ బాధ్యత కోసం కోర్టు మెట్లెక్కారు. న్యాయస్థానం ఆ బిడ్డను తల్లికి అప్పగించింది. వారంలో మూడు రోజులు కూతుర్ని కలవొచ్చని తండ్రికి సూచించింది. విదేశాలకు పారిపోకుండా పాస్‌పోర్ట్‌ను సమర్పించాలని లోహియాను ఆదేశించింది. అయితే గతేడాది ఆగస్టు 24న బిడ్డను కలిసిన లోహియా చిన్నారిని తీసుకొని దుబాయ్‌కి చెక్కేశాడు. డొమినికా దేశపు పాస్‌పోర్ట్‌ను సంపాదించిన ఆయన.. నేపాల్‌గుండా దుబాయ్‌ చేరాడు. అంతర్జాతీయ అంశాలు ముడిపడి ఉండడంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. ఇంటర్‌పోల్‌  సాయంతో లోహియాను అదుపులోకి తీసుకుని చిన్నారితో సహా స్వదేశానికి తీసుకొచ్చింది. శుక్రవారం ఆ బాలికను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. లోహియాపై కేసులు నమోదుచేశారు.  logo