గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 02:01:48

హోర్డింగ్‌ల వెల్లువ!

హోర్డింగ్‌ల వెల్లువ!

అహ్మదాబాద్‌: ట్రంప్‌కు స్వాగతం పలికే హోర్డింగ్‌లతో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగర వీధులన్నీ నిండిపోయాయి. ‘ఉజ్వల భవిష్యత్‌ కోసం బలమైన స్నేహం’ అనే సందేశంతో కూడిన హోర్డింగ్‌లు అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. గతేడాది అమెరికాలో జరిగిన ‘హౌడీ మౌదీ’ వేడుకలో ట్రంప్‌, మోదీ కరచాలనం తదితర ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లు 22 కి.మీ. పొడవునా ఏర్పాటు చేశారు. అయితే గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ ఫొటో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. 


గుజరాతీ ఘుమఘుమలు

ట్రంప్‌ కోసం ఘుమఘుమలాడే గుజరాతీ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఖమ్మన్‌, బ్రోకోలి సమోస, హనీ-డిప్‌ కుకీస్‌, మల్టీ గ్రేన్‌ రోటీస్‌, కొబ్బరి నీళ్లు, ఐస్‌ టీ, స్పెషల్‌ చాయ్‌, స్నాక్స్‌ రుచులను ట్రంప్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు ఆస్వాదించనున్నారు. ప్రముఖ చెఫ్‌ సురేశ్‌ ఖన్నా ఆధ్వర్యంలో తయారుకానున్న ఈ వంటకాలను తొలుత భద్రతా తనిఖీలకు పంపుతారు. భద్రతా అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాక ట్రంప్‌ వాటని రుచిచూస్తారు.


logo
>>>>>>