గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 00:45:22

ముగ్గురు చిన్నారుల సజీవదహనం

ముగ్గురు చిన్నారుల సజీవదహనం
  • ఒడిశాలో ఘటన

బరంపురం: మరుగుదొడ్డిపై వేసిన మంచె కు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొ ని ఒక బాలికతోపాటు ముగ్గురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతులంతా పదేండ్లలోపు చిన్నారులే. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం  ఆదివా రం ఉదయం ఒడిశా గంజాం జిల్లా కొ యిరాచట్ట గ్రామంలోని ఓ ఇంటి వెనుక నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డిపై గడ్డితో వేసిన మంచెపై చిన్నారులు ఆడుకుంటున్నప్పుడు మంటలు అంటుకోవడంతో సాయి రాం జానీ, దీపక్‌గౌడ, ఇతిశ్రీజెనా అనే ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని బరంపురంలోని ఓ ద వాఖానలో చేర్పించగా.. చికిత్స పొందు తూ మృతిచెందారు. 60%కాలిన గాయాలతో ఉన్న మరో చిన్నారి అలోక్‌జెనాకు ఇదే దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.  


logo