శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 02:04:47

‘కశ్మీర్‌ ముక్తి’, ‘దళిత్‌ ముక్తి’..

‘కశ్మీర్‌ ముక్తి’, ‘దళిత్‌ ముక్తి’..
  • బెంగళూరులో ప్లకార్డు కలకలం

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా బెంగళూరులో గురువారం నిర్వహించిన ఓ సభలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌' అని నినాదాలు చేసిన అమూల్య లియోనా ఘటనను మరువకముందే తాజాగా అదే నగరంలో మరో ఘటన చోటుచేసుకున్నది. ‘కశ్మీర్‌ ముక్తి, ‘దళిత్‌ ముక్తి’, ‘ముస్లిం ముక్తి’ అంటూ కశ్మీరీలు, దళితులు, ముస్లింలకు విముక్తి కావాలనే అర్థంలో శుక్రవారం ఒక యువతి ప్లకార్డులు ప్రదర్శించింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌' అని నినాదాలు చేసిన అమూల్య లియోనా వైఖరిని నిరసిస్తూ బెంగళూరులో శుక్రవారం హిందూ జాగరణ్‌ వేదిక ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆరుద్ర అనే యువతి.. కార్యక్రమం జరుగుతుండగా ‘కశ్మీర్‌ముక్తి’, ‘దళిత్‌ ముక్తి’, ‘ముస్లిం ముక్తి’ అంటూ ఇంగ్లిష్‌, కన్నడ అక్షరాలతో రాసిన ప్ల్లకార్డులు ప్రదర్శించడం కలకలం రేపింది. ‘వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తించిన ఆరుద్రపై కేసు నమోదు చేశాం’ అని పోలీసులు తెలిపారు.


logo