బుధవారం 15 జూలై 2020
National - Jun 17, 2020 , 09:57:56

భారత్‌ అతలాకుతలం.. 24 గంటల్లో 2003 మంది మృతి

భారత్‌ అతలాకుతలం.. 24 గంటల్లో 2003 మంది మృతి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌ను పట్టిపీడిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులతో దేశం అతలాకుతలమవుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కాటుకు 2003 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 10,974 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,54,065కు చేరగా, మృతుల సంఖ్య 11,903కు చేరింది. 1,55,227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ వైరస్‌ నుంచి 1,86,935 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 1,13,445 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 5,537 మంది చనిపోయారు. తమిళనాడులో 48,019 కేసులు(మృతులు 528), ఢిల్లీలో 44,688(మృతులు 1,837), గుజరాత్‌లో 24,628(మృతులు 1,534) పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 


logo