శనివారం 06 జూన్ 2020
National - May 15, 2020 , 16:49:18

మ‌త్స్య సంప‌ద యోజ‌న కోసం 20 వేల కోట్లు

మ‌త్స్య సంప‌ద యోజ‌న కోసం 20 వేల కోట్లు

 

హైద‌రాబాద్‌: మ‌త్స్య ప‌రిశ్ర‌మ అభివృద్ధి కోసం కేంద్రం భారీ ప్ర‌క‌ట‌న చేసింది.  ప్ర‌ధాన మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న ప‌థ‌కానికి 20 వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. స‌ముద్ర‌, ఆక్వా, చేప‌ల చెరువుల స‌మ‌గ్ర‌, సుస్థిర అభివృద్ధి కోసం ఈ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు.  మెరైన్‌, ఇన్‌ల్యాండ్ ఫిష‌రీస్‌, ఆక్వాక‌ల్చ‌ర్ కోసం 11వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఫిషింగ్ హార్బ‌ర్స్‌, కోల్డ్ చెయిన్స్‌, మార్కెట్ల కోసం మ‌రో 9 వేల కోట్ల నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.  ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్‌లో భాగంగా మంత్రి సీతారామ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. 


మ‌త్స సంప‌ద యోజ‌న ప‌థ‌కం ద్వారా రానున్న అయిదేళ్ల‌లో దాదాపు 70 ల‌క్ష‌ల ట‌న్నుల చేప‌ల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఈ విధానం వ‌ల్ల సుమారు 55 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ అవ‌కాశాలు దొరికే ఛాన్సు ఉన్న‌ది. అంతేకాదు, మ‌త్స్య ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఎగుమ‌తుల విలువ సుమారు ల‌క్ష కోట్లు దాటుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తున్న‌ది. 


logo