గురువారం 28 మే 2020
National - May 19, 2020 , 22:07:30

జూన్ 1 నుంచి 200 రైళ్లు

జూన్ 1 నుంచి 200 రైళ్లు

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడాని ఎదురు చేస్తున్నప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. జూన్ 1 నుంచి 200 రైళ్లు నడపాలని ఈ మేరకు నిర్ణయించింది. గతంలోని రైళ్ల షెడ్యూల్ టైం టేబుల్ ప్రకారంగా రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో వెల్లడించారు. రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఇస్తున్నామని, కౌంటర్ల ద్వారా బుకింగ్ అవకాశం లేదని, ప్రస్తుతానికి నాన్ ఏసీ రైళ్లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. వలస కార్మికుల సౌకర్యార్థం ప్రతి రోజు 200 శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడుపాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు.


logo