ఆదివారం 12 జూలై 2020
National - Jun 25, 2020 , 11:12:47

భారీగా కల్తీ నెయ్యి స్వాధీనం

భారీగా కల్తీ నెయ్యి స్వాధీనం

జోధ్‌పూర్‌: సుమారు 200కుపైగా డబ్బాల్లో ఉన్న కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఓ కంపెనీ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లుగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులు కలిసి బుధవారం రాత్రి ఓ ఇంటిపై రైడ్‌ చేశారు. ఆ ఇంటి లోపల తనిఖీ చేయగా భారీగా కల్తీ నెయ్యి తయారు చేస్తున్న విషయం బయటపడింది. దీంతో 200కిపైగా డబ్బాల్లో ఉన్న కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.


logo