శుక్రవారం 10 జూలై 2020
National - Jun 18, 2020 , 02:00:36

200 చైనా మిలిటరీ వాహనాలు

200 చైనా మిలిటరీ వాహనాలు

న్యూఢిల్లీ: తూర్పు లఢక్‌లోని గల్వాన్‌ లోయ ప్రాంతంలో సోమవారంనాడు భారత జవాన్లపై దాడి చేసి ఉద్రిక్తతలకు పాల్పడిన చైనా బలగాలు ఆ తర్వాత కూడా తమ కుట్రలను కొనసాగించాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తావివ్వకూడదని చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. ఘర్షణలు జరిగిన 24 గంటల తర్వాత కూడా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి బారులుదీరాయి. అమెరికాకు చెందిన ఎర్త్‌ ఇమేజింగ్‌ సంస్థ ‘ప్లానెట్‌ ల్యాబ్స్‌' విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం స్పష్టమైంది. సోమవారం ఘర్షణలు జరిగిన అనంతరం కూడా గల్వాన్‌ లోయ ప్రాంతాల్లో చైనాకు చెందిన 200కు పైగా మిలిటరీ వాహనాలు, పదుల సంఖ్యలో టెంట్లు ఉన్నట్టు చిత్రాల్లో కనిపిస్తున్నది.


logo