బుధవారం 28 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 08:21:19

8 ఏండ్ల బాలికపై పక్కింటి యువకుడి అత్యాచారం

8 ఏండ్ల బాలికపై పక్కింటి యువకుడి అత్యాచారం

లక్నో: అభం శుభం తెలియని ఎనిమిదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో యువకుడు. స్నానం చేయిస్తానని నమ్మబలికి ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోనే అజమ్‌ఘడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

అజమ్‌ఘడ్‌ జిల్లాలోని ఓ గ్రామంలో దినేశ్‌ అనే 20 ఏండ్ల యువకుడు తన ఇంటి పక్కనే ఉన్న బాలిక ఇంటికి బుధవారం సాయంత్రం వెళ్లాడు. ఆమెకు స్నానం చేయిస్తానని ఆమె తల్లికి చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన బాలిక తనకు బాగా నొప్పిగా ఉందని తల్లికి చెప్పింది. బ్లీడింగ్‌ అవుతుండటంతో వెంటనే ఆమెను దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. 

ఈ ఘటనపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం సాయంత్రం దినేశ్‌ తమ ఇంటికి వచ్చాడని, స్నానం చేయిస్తానని తన కూతురును, ఆమె దుస్తులను కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అతన్ని అరెస్టు చేశామని అజమ్‌ఘడ్‌ ఎస్పీ సుధీర్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు.         


logo