శనివారం 30 మే 2020
National - May 13, 2020 , 11:49:32

ఢిల్లీలో 24 గంటల్లో 20 మంది మృతి

ఢిల్లీలో 24 గంటల్లో 20 మంది మృతి

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ వెల్లడించారు. కొత్తగా 359 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. దీంతో ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7998కి చేరింది. ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనాతో 106 మంది చనిపోయారు. ఈ వైరస్‌ నుంచి 2,858 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

దేశంలో కరోనా కేసులను చూస్తే.. మహారాష్ట్రలో అత్యధికంగా 24,427 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 921 మంది మృతి చెందారు. రెండు, మూడు స్థానాల్లో గుజరాత్‌, తమిళనాడు నిలిచాయి. ఢిల్లీ నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్‌లో 8,904 కేసులు, తమిళనాడులో 8,718 కేసులు నమోదు అయ్యాయి. 


logo