సోమవారం 25 మే 2020
National - Mar 29, 2020 , 20:49:53

కేర‌ళ‌లో ఒకేరోజు 20 మందికి క‌రోనా

కేర‌ళ‌లో ఒకేరోజు 20 మందికి క‌రోనా

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు చాలా స్పీడ్‌గా పెరుగుతున్న‌ది. తాజాగా ఆదివారం ఒక్క‌రోజే 20 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం రాత్రి కేర‌ళ వైద్య ఆరోగ్య శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఆదివారం క‌రోనా పాజిటివ్‌గా తేలిన 20 మందిలో 18 మంది విదేశాల నుంచి వ‌చ్చిన‌వారేన‌ని, మ‌రో ఇద్ద‌రికి మాత్రం క‌రోనా పాజిటివ్‌గా కేసుల నుంచి ఈ మ‌హ‌మ్మారి సోకింద‌ని ఆరోగ్య శాఖ‌ వివ‌రించింది.

తాజాగా న‌మోదైన 20 కేసుల‌తో క‌లిపి కేర‌ళలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 202కు చేరిందని వైద్య అధికారులు తెలిపారు. ఇందులో 181 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. మ‌రో 21 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ 21 మందిలో న‌లుగురికి ఆదివారం క‌రోనా నెగెటివ్ గా తేలింద‌ని వారు చెప్పారు.         


logo