గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 14:14:13

సంక్షోభంలో మధ్యప్రదేశ్‌ సర్కార్‌

సంక్షోభంలో మధ్యప్రదేశ్‌ సర్కార్‌

  • 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా..
  • కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య గుడ్‌బై

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ  సాయంత్రం బీజేపీలో చేరనున్నారు. సింధియా మద్దతుదారులైన 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు  బెంగళూరులోని ఓ రిసార్టులో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా  చేశారు.  మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌కు  ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు పంపారు.  రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా జ్యోతిరాదిత్యకు మద్దతుగా ఉన్నారు.  సింధియా తిరుగుబాటుతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కుప్పకూలనుంది. బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మృతి చెందడంతో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్వతంత్రులు, బీఎస్పీ, ఎస్పీ సభ్యులు కాంగ్రెస్‌ సర్కార్‌కు మద్దతిస్తున్నారు.

బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు రాజీనామా నేపథ్యంలో సింధియాకు బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇవాళ్లి సాయంత్రంలోగా మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కిరానుంది.  సాయంత్రం 7 గంటలకు భోపాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ చెరో స్థానాన్ని దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీ ఉంది.. మూడో సీటు కోసం రెండు పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి.

ప్రస్తుత అసెంబ్లీలో బలాబలాలు:

మొత్తం సీట్లు 228(230)

కాంగ్రెస్‌ 114

బీజేపీ 107

స్వతంత్రులు 4

బీఎస్పీ 2

ఎస్పీ 1


logo