గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 16:19:22

డ్ర‌గ్స్ దొర‌క‌క క‌త్తిని మింగాడ‌ట‌!

డ్ర‌గ్స్ దొర‌క‌క క‌త్తిని మింగాడ‌ట‌!

ఢిల్లీ: ‌మాద‌కద్ర‌వ్యాల‌కు బానిస‌గా మారిన ఓ 28 ఏండ్ల యువ‌కుడు లాక్‌డౌన్ కార‌ణంగా డ్ర‌గ్స్ అందుబాటులో  లేక‌పోవ‌డంతో ఏంచేయాలో తోచ‌క‌  ఏకంగా వంటింట్లో ఉన్న‌ క‌త్తిని మింగేశాడు. అంతేగాక‌ నెల‌న్న‌ర‌కుపైగా పొట్ట‌లో ప‌దునైన క‌త్తి ఉన్నా చాలా సాధార‌ణంగా జీవ‌నం గ‌డిపాడు. వైద్యుల‌నే ఆశ్చ‌ర్యానికి గురిచేసిన ఈ ఘ‌ట‌న హర్యానాలో చోటుచేసుకుంది.  అయితే, ఇటీవ‌ల తీవ్ర క‌డుపు నొప్పి రావ‌డంతో ఎక్స్‌రే తీశారు. ఆ ఎక్స్‌రేలో దృశ్యాన్ని చూసి వైద్యులే షాక‌య్యారు. అత‌ని కడుపులో 20 సెంటీమీట‌ర్ల క‌త్తి ఉన్న‌ట్లు గుర్తించారు. 

ఢిల్లీ ఎయిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన వైద్యులు విజ‌య‌వంతంగా శ‌స్త్ర‌చికిత్స చేసి బాధితుడి క‌డుపులో నుంచి క‌త్తిని తొల‌గించారు. ప్ర‌స్తుతం యువకుడి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు చెప్పారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ ఎన్ఆర్ దాస్ పర్యవేక్షణలో యువ‌కుడికి మూడు గంట‌ల‌పాటు శస్త్రచికిత్స నిర్వ‌హించారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ.. ఒక వ్య‌క్తి 20 సెంటీమీట‌ర్ల క‌త్తిని మింగి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టం చాలా అరుద‌ని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo