సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 08:20:10

అరటి పండులో విషం కలిపి 20 పశువులను చంపారు

అరటి పండులో విషం కలిపి 20 పశువులను చంపారు

కర్ణాటక : అరటి పండులో విషం కలిపి పెట్టడంతో 20 పశులు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఐగూరు ఎస్టేట్‌లో చోటు చేసుకుంది. ఎస్టేట్‌ సమీపంలోని గ్రామాల నుంచి నిత్యం పశువులు మేతకు వెళ్లేవి. గ్రామ సమీపంలోని కాఫీ తోటలోకి పశువులు వెళ్లి పంటను నాశనం చేస్తున్నాయని కాఫీ తోట మేనేజర్‌, సిబ్బంది కలిసి అరటి పండులో విషం కలిపి పశువులకు తినిపించేవారు దీంతో అవి మరణించేవి. విషయం బయటికి వెళ్లకుండా తోటలోనే గొయ్యి తీసి పూడ్చేవారు.

ఇలా 20 పశువులను చంపేశారు. తీరా పశువులు కనిపించడంలేదని యజమానులు ఆదివారం గ్రామ చుట్టుపక్కల వెతుక్కుంటూ కాఫీ తోట వైపుకు రాగా అక్కడ పశువుల కళేబరాలు కనిపించడంతో తోట సిబ్బందిని నిలదీశారు. దీంతో అపలు విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo