గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 11:39:21

54 ఏళ్ల మహిళకు కవలలు జననం

54 ఏళ్ల మహిళకు కవలలు జననం

తిరువనంతపురం : కేరళలో ఓ 54 ఏళ్ల కవలలకు జన్మనిచ్చింది. పట్టణమిట్టకు చెందిన శ్రీధరన్‌(64), కుమారి(54) దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే అతను రెండేళ్ల క్రితం రోడ్డుప్రమాదం చనిపోయాడు. దీంతో శ్రీధరన్‌ దంపతులు ఒంటరి అయ్యారు. ఎలాగైనా మళ్లీ సంతానం కావాలని ఆ దంపతులు కలలు కన్నారు. వారు అనుకున్నట్టుగానే ఫెర్టిలిటి ట్రీట్‌మెంట్‌ ద్వారా మళ్లీ పిల్లలను కన్నారు.

కుమారి.. కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు మగ శిశువు కాగా, మరొకరు ఆడ శిశువు. ఈవిడకు కొల్లాంలోని లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ అందించారు. ఇన్‌ఫెర్టిలిటి స్పెషలిస్టు డాక్టర్‌ కే. పాపాచ్చాన్‌ పర్యవేక్షణలో కుమారికి వైద్యం జరిగింది. అయితే ఈ వయసులో పిల్లల్ని కంటామని ఊహించలేదు. కానీ కుమారుడు చనిపోయిన తర్వాత పిల్లల్ని కనాల్సి వచ్చిందన్నారు. కవల పిల్లల జన్మతో ఆ దంపతులు సంతోషంలో మునిగిపోయారు. 


logo