మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 24, 2020 , 20:15:30

బాలుడు మీద‌కు రైలు వెళ్లినా స‌రే.. చిన్న‌గాయం కూడా త‌గ‌ల్లేదు!

బాలుడు మీద‌కు రైలు వెళ్లినా స‌రే.. చిన్న‌గాయం కూడా త‌గ‌ల్లేదు!

అదృష్టం ఉంటే ఆకాశంలోంచి కింద ప‌డినా స‌రే.. య‌మ‌ధ‌ర్మ‌రాజుకు హాయ్ చెప్పి భూలోకానికి కూడా వ‌స్తారు. అదే శ‌ని వెంటాడుతుంటే మంచం మీది నుంచి కింద‌ప‌డినా ప్రాణాలు కోల్పోతారు. ఈ బాలుడికి అదృష్టం అంతా ఇంతా కాదు. రైలు త‌న మీద‌కు ఎక్కినా చిన్న గాయం కూడా త‌గ‌ల్లేదు. క్షేమంగా బ‌య‌ట‌కు వ‌చ్చి ఆడుకుంటున్నాడు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే చావు అంచుల వ‌ర‌కు వెళ్లొచ్చాడు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్ స‌మీపంలో బ‌ల్లాబ్‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ ట్రాక్ మీద ఇద్ద‌రు అన్నాత‌మ్ముళ్లు ఆడుకుంటున్నారు.

ఆ స‌మ‌యంలో పెద్దోడు చిన్నోడిని ట్రాక్ మీద‌కు నెట్టేయ‌డంతో వాడు ప‌డిపోయాడు. అప్పుడే అదే ట్రాక్ మీద గూడ్స్ రైలు వేగంగా దూసుకు వ‌చ్చింది. భ‌యంతో ఏడుస్తున్న పిల్లాడిని చూసి డ్రైవ‌ర్ స‌డ‌న్ బ్రేక్ వేశాడు. అయినా రైలు ఆ పిల్లాడి మీద‌కు ఎక్కేసింది. అయ్యో.. అనుకుంటూ డ్రైవ‌ర్ కింద‌కి దిగి చూసేస‌రికి పిల్లాడు స్తంభంలా నిల్చొని ఉండ‌టం చూసి షాక్ అయ్యాడు. ఇంజిన్ కింద చిక్కుకున్న పిల్లాడిని బ‌య‌ట‌కు తీసి త‌ల్లికి అప్ప‌చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వీడియో చూసిన నెటిజ‌న్లు డ్రైవ‌ర్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచేశారు.