ఆదివారం 12 జూలై 2020
National - Jun 26, 2020 , 15:00:10

3 నిమిషాల్లో 100 కారు బ్రాండ్ల‌ను ట‌క‌ట‌కా చెప్పిన రెండేండ్ల బుడ‌త‌డు!

3 నిమిషాల్లో 100 కారు బ్రాండ్ల‌ను ట‌క‌ట‌కా చెప్పిన రెండేండ్ల బుడ‌త‌డు!

మీకు కార్లంటే ఇష్టమా? అయితే మీకు తెలిసిన‌ కారు పేర్ల‌ను చెప్పండి చూద్దాం. ఎన్ని చెప్ప‌గ‌ల‌రు. మ‌హా అయితే 5,10 పోనీ ఇంకా తెలుసుంటే 20 తెలుసేమో.. అంత‌కంటే ఒక‌టి కూడా ఎక్కువ చెప్ప‌లేరు క‌దా. కానీ, త‌ప్ప‌ట‌డుగులు వేసే ఈ బుడ‌త‌డు మాత్రం ట‌క‌ట‌కా 100 కారు బ్రాండ్ల‌ను చెప్పేశాడు. ఈ వ‌య‌సులో కొంత‌మంది పిల్ల‌లు అమ్మా, నాన్న అని ఇంట్లో వాళ్లంద‌ర‌నీ పిలిస్తేనే.. మా బాబే అంటూ మురిసిపోతాం. మ‌రి ఈ చిన్నారికి ఇన్ని కార్లు ఎలా తెలుసు? ఎప్పుడు చూశాడు. ఆ పేర్ల‌న్ని ఎవ‌రు నేర్పించారో కాని అద్భుతం క‌దా?

ఈ బుడ్డోడు పేరు దేవంష్ నారాయ‌ణం. తండ్రి ఫోన్‌లో కార్ల‌ను చూపిస్తూ కారు పేరు ఏంట‌ని అడిగితే ముద్దు ముద్దు మాట‌ల‌తో జ‌వాబు ఇచ్చాడు. మ‌ధ్య‌లో నేను చెప్ప‌ను అంటూ ప‌క్క‌కు వెళ్తుంటే చెప్పు నాన్న అంటూ చెప్పించాడు తండ్రి. 5 నిమిషాల వీడియో తీయ‌డానికి తండ్రి బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. ఇప్పుడే ఇంత ఘ‌న‌త సాధిస్తే భ‌విష్య‌త్తులో మంచి పేరు తెచ్చుకోవాల‌ని నెటిజ‌న్లు ఆశీర్వ‌దిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.  


logo