e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News బందిపొరాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

బందిపొరాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని బందిపొరలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బండిపొరాలో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు గాలింపు బృందాలపై కాల్పులు జరిపాయి.

దీంతో భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారని జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. వారు ఏ సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని, వారిని మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement