గురువారం 09 జూలై 2020
National - Jun 19, 2020 , 10:57:39

రెండు లారీల్లోని ఎరువులను లూఠీ చేసిన జనం

రెండు లారీల్లోని ఎరువులను లూఠీ చేసిన జనం

భోపాల్‌: ఎరువులతో వెళ్తున్న రెండు లారీలను జనం లూఠీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లా సహకార సంఘం అధికారులు ఎరువులను రెండు లారీల్లో తరలిస్తున్నారు. అయితే మార్గమధ్యలో ఈ లారీలను స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం అందులోని ఎరువుల బస్తాలను ఎవరికి వారు పట్టుకునిపోయారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా సహకార సంఘం అధికారులు దీనిపై దర్యాప్తు జరిపి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 
logo