ఆదివారం 29 మార్చి 2020
National - Feb 12, 2020 , 08:18:05

ఒడిశాలో ఘోర ప్రమాదం : ఇద్దరు మృతి

ఒడిశాలో ఘోర ప్రమాదం : ఇద్దరు మృతి

భువనేశ్వర్‌ : ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బారిక్‌పూర్‌ వద్ద ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీ, టూరిస్ట్‌ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారందరిని భద్రక్‌ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. టూరిస్టులంతా ఉత్తరప్రదేశ్‌ నుంచి పూరీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది యాత్రికులు ఉన్నారు. 

రాజీవ్‌ రహదారిపై రోడ్డుప్రమాదం

పెద్దపల్లి : సుల్తానాబాద్‌లో రాజీవ్‌ రహదారిపై కూడా రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి 4 విద్యుత్‌ స్తంభాలు, ఒక వృక్షాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్‌, క్లీనర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. 


logo