బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 19:43:02

ఇద్ద‌రు పోలీస్ అధికారులు స‌స్పెండ్..

ఇద్ద‌రు పోలీస్ అధికారులు స‌స్పెండ్..

బెంగ‌ళూరు: అక్ర‌మంగా సిగ‌రెట్ల అమ్మ‌కాల్లో ప్ర‌మేయమున్న ఇద్ద‌రు పోలీసు అధికారుల‌పై స‌స్పెన్ష‌న్ వేటుప‌డింది. లాక్ డౌన్ స‌మ‌యంలో  భారీ మొత్తం లో అక్ర‌మ సిగ‌రెట్లు అమ్మ‌కాలు జ‌రుపుతున్న వ్య‌క్తుల‌కు స‌హ‌క‌రించార‌న్న ఆరోప‌ణ‌లపై దర్యాప్తు జరిపాం. అక్ర‌మ సిగ‌రెట్లు అమ్మ‌కాల్లో ఇద్ద‌రు పోలీసుల పాత్ర ఉన్న‌ట్లు ద‌ర్యాప్తు లో   తేల‌‌టంతో వారిని స‌స్పెండ్ చేశామ‌ని జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ (క్రైం)సందీప్ పాటిల్ తెలిపారు. 

ఏప్రిల్ 24న‌ బెంగ‌ళూరులో సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించి.. సిగ‌రెట్ల ప్యాక్ తో కారులో వెళ్తున్న అక్త‌ర్ మీర్జా, త‌బుద్దీన్ మొహిద్దిన్ అనే ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30 వేల విలువైన సిగ‌రెట్ల‌ను సీజ్ చేశారు. ఆన్ లైన్ లో సిగ‌రెట్లు విక్ర‌యిస్తున్న ఇద్ద‌రిపై కేసు కూడా న‌మోదు చేశారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo