బుధవారం 08 జూలై 2020
National - Jun 23, 2020 , 13:49:21

ఐసోలేష‌న్‌లో ప‌రీక్ష రాసేందుకు సీఎం అనుమ‌తి!

ఐసోలేష‌న్‌లో ప‌రీక్ష రాసేందుకు సీఎం అనుమ‌తి!

భ‌విష్య‌త్తుపై ఎన్నో ఆశ‌లు. వాటిని నెర‌వేర్చుకునేందుకు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్న విద్యార్థుల క‌ల‌ల‌‌ను నాశ‌నం చేయ‌డానికి క‌రోనా వైర‌స్ తిష్ట వేసుకొని కూర్చొంది. ప‌టియాలా హాస్పిట‌ల్‌లో కాంట్రాక్ట్ న‌ర్సుగా చేస్తున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు కొవిడ్‌-19 పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు నిర్థార‌ణ అయింది. గ‌వ‌ర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవ‌డానికి వీరిద్ద‌రూ ప్ర‌తిరోజూ డ్యూటీ అయ్యాక చ‌దువుకునేవాళ్లు. ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు తెచ్చుకుంటామ‌ని ఇంట్లో చెబుతుండేవారు. ఇంత‌లోనే క‌రోనా. అస‌లే ప‌రీక్ష‌లు షెడ్యూల్ జూన్ 21 అని చెప్పారు.

అసోలేష‌న్‌కు ప‌రిమిత‌మైన వీరు ఎగ్జామ్ సెంట‌ర్‌కు త‌ర‌లించలేరు. దీంతో వీరు క‌న్నక‌ల‌ల‌న్నీ బూడిద‌య్యాయి. విష‌యం తెలుసుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ వీరి ప‌రీక్ష‌లు రాసేందుకు అనుమ‌తి ఇచ్చారు. అయితే.. ఎగ్జామ్ సెంట‌ర్‌లో కాకుండా ఐసోలేష‌న్ వార్డ్‌లో రాయ‌మ‌ని ప్రోత్స‌హించారు. క‌రోనా సోకిన‌ప్ప‌టికీ యువ న‌ర్సులు ప‌రీక్ష‌లు రాసేందుకు మొగ్గు చూపండంతో ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపించారు సీఎం. logo