శుక్రవారం 10 జూలై 2020
National - Jun 23, 2020 , 21:27:41

కరోనాతో మరో ఇద్దరు మహారాష్ట్ర పోలీసుల మృతి

కరోనాతో మరో ఇద్దరు మహారాష్ట్ర పోలీసుల మృతి

ముంబై: కరోనా మహమ్మారి నివారణకు నిత్యం విధుల్లో ఉంటున్న పోలీసులూ కొవిడ్‌ బారినపడి మృత్యువాతపడుతున్నారు. మహారాష్ట్రలో మంగళవారం మరో ఇద్దరు పోలీసులు కరోనాతో కన్నుమూశారు. ‘ఏఎస్‌ఐ సూర్యకాంత్‌ జాదవ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ ప్రదీప్‌ కాశీద్‌ దురదృష్టవశాత్తూ కరోనాతో పోరాడుతూ మృతిచెందారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. వారి కుటుంబాలకు అండగా ఉంటాం.’ అని ముంబై పోలీసులు ట్వీట్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 4,000 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. 47 మంది రక్షక భటులు కన్నుమూశారు. logo