బుధవారం 21 అక్టోబర్ 2020
National - Aug 29, 2020 , 14:18:40

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌..క్వారంటైన్‌లో కెప్టెన్‌

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌..క్వారంటైన్‌లో కెప్టెన్‌

న్యూఢిల్లీ: పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిర్మల్‌ సింగ్‌, కుల్బీర్‌ సింగ్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.   ఎమ్మెల్యేలు   ఇటీవల విధాన సభలో  ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్‌ ప్రొటోకాల్‌, వైద్యుల సలహా ప్రకారం ఏడు రోజుల పాటు  స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని   అమరీందర్‌ సింగ్‌ నిర్ణయించుకున్నారని అధికారులు తెలిపారు.   ఈ ఇద్దరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన శాసనసభ్యుల సంఖ్య 32కి చేరుకున్నది. 


logo