ఆదివారం 05 జూలై 2020
National - Jun 14, 2020 , 20:11:35

ముగ్గురు కాంగ్రెస్‌ నేతలు అరెస్ట్‌

ముగ్గురు కాంగ్రెస్‌ నేతలు అరెస్ట్‌

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ నేతలు ఆదివారం అరెస్ట్‌ అయ్యారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ ఇండోర్‌ కాంగ్రెస్‌ చీఫ్ వినయ్ బక్లివాతో కలిసి మాజీ మంత్రి జితు పట్వారీ, ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విశాల్‌ పటేల్‌, సంజయ్‌ శుక్లా శనివారం ధర్నా చేశారు. అయితే దీనికి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి వారికి సమన్లు జారీ చేశారు. ఆదివారం సరఫా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న విశాల్‌, సంజయ్‌, వినయ్‌ను కోర్టు అరెస్ట్‌ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 29న స్థానిక కోర్టుకు హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారని, విపక్ష నేతలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారని వారు ఆరోపించారు. కాగా జితు పట్వారీ భోపాల్‌లో ఉండటంతో పోలీస్‌ స్టేషన్‌కు రాలేకపోయారని వినయ్ బక్లివా తెలిపారు. logo