శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 22:45:24

‘ధిక్కార’ స్వరానికి ఇద్దరు మావోస్టులు బలి!

‘ధిక్కార’ స్వరానికి ఇద్దరు మావోస్టులు బలి!

ఛత్తీస్‌గఢ్‌ : ధిక్కార స్వరం వినిపించారని మావోయిస్టులు సొంత పార్టీ కార్యకర్తలనే హత్య చేసిన ఘటన బుధవారం రాత్రి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లాలోని బస్తర్‌ రీజియ‌న్‌లో మావోయిస్టులు తమ సొంత గ్రామంతో అనుసంధానించబడిన రహదారిని తవ్వాలని ఇచ్చిన ఆదేశాలను పాటించడానికి నిరాకరించడంతో పాటు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, రక్షించేందుకు సహకరించిన ముగ్గురు గ్రామస్తులను సైతం కొట్టారని దంతెవాడ పోలీ‌స్‌ సూపరింటెండెంట్‌ అభిషేక్ పల్లవ గురువారం తెలిపారు. ఈ ఘటన అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొటాలి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మృతులు సీపీఐ మావోయిస్ట్‌ కమాండర్‌‌, సభ్యులైన భజరంగ్‌ వెట్టి, టిడో మాండవిగా గుర్తించారు.

మృతులు పొటాలి గ్రామానికి చెందిన వారని ఎస్పీ చెప్పారు. గ్రామంలో మావోయిస్టుల సమావేశం జరిగిందని, ఇక్కడ కుగ్రామానికి అనుసంధానించే రహదారిని తవ్వకుండా గ్రామస్తులు అడ్డుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. తర్వాత వెట్టి, మాండవికి రోడ్డు తవ్వే పనులు అప్పగించారు. ఈ పనిని చేసేందుకు వారు నిరాకరించారు. రోడ్డును తవ్వితే గ్రామస్తులకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. దీంతో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో మృతి చెందారని, రక్షించేందుకు ప్రయత్నించిన ముగ్గురు గ్రామస్తులను చితకబాదారని ఎస్పీ వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo