సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 11:14:09

అనంత్‌నాగ్‌లో ఇద్ద‌రు ల‌ష్క‌రే ఉగ్ర‌వాదుల హ‌తం

అనంత్‌నాగ్‌లో ఇద్ద‌రు ల‌ష్క‌రే ఉగ్ర‌వాదుల హ‌తం

అనంత్‌నాగ్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌ట్టుబెట్టాయి. అనంత్‌నాగ్ జిల్లాలోని సిర్హ‌మా ప్రాంతంలో ఈరోజు ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఘ‌ట‌నా స్థ‌లంలో భార‌తీగా ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామ‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు ప్ర‌క‌టించారు.   

విశ్వ‌స‌నీయ స‌మాచారంతో సిర్హ‌మా ప్రాంతంలో గురువారం సాయంత్రం భ‌ద్ర‌తాబ‌ల‌గాలు గాలింపు ప్రారంభించాయి. ఈసంద‌ర్భంగా భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు తార‌స‌ప‌డిన‌ ఉగ్ర‌వాదులు కాల్పులు ప్రారంభించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇరు ప‌క్షాల మ‌ధ్య కాల్పులు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి.  


logo