ఆదివారం 29 మార్చి 2020
National - Feb 22, 2020 , 09:22:03

ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లాలోని సంగం ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి అక్కడ కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. 


logo