శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 10:44:25

సౌదీలో 2 ల‌క్ష‌ల మందికి క‌రోనా!

సౌదీలో 2 ల‌క్ష‌ల మందికి క‌రోనా!

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో కరోనా మ‌హ‌మ్మారి విలయతాండవం చేస్తున్న‌ది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ పోతున్న‌ది. దీంతో ఇప్ప‌టికే ఆ దేశంలో న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 2 లక్షల మార్కును దాటేసింది. శుక్రవారం నమోదైన 4,193 కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ వైరస్ బారినప‌డిన‌వారి సంఖ్య 2,01,801కి చేరింది. కాగా, మొత్తం కేసుల‌లో 1,40,000 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగ‌తావారు ఆస్ప‌త్రుల్లో, క్వారెంటైన్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. 

కాగా, సౌదీ అరేబియాలో క‌రోనా మృతుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా మృతుల సంఖ్య 1,802కు చేరింది. దేశంలో క‌రోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్ర‌కు పరిమిత సంఖ్యలో మాత్రమే యాత్రికులను అనుమతించనున్నట్లు సౌదీ ప్ర‌భుత్వం ప్రకటించింది. అంతేగాక, హజ్ యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరిని క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన తర్వాతనే అనుమతిస్తామ‌ని యాత్ర నిర్వాహ‌కులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo