గురువారం 03 డిసెంబర్ 2020
National - May 24, 2020 , 20:04:04

క్వారంటైన్‌కు‌ పోవాలంటే.. కొట్టి చంపారు

 క్వారంటైన్‌కు‌ పోవాలంటే.. కొట్టి చంపారు

ఔరంగాబాద్‌: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకొంది. వలస కార్మికులకు క్వారంటైన్‌ కావాలని అడిగిన ఇద్దరిని ఆ గుంపు మూకుమ్మడిగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిలంగా తహశీల్‌ పరిధిలోని బోలేగావ్‌కు చెందిన ఓ వ్యక్తి.. గుజరాత్‌కు చెందిన డ్రైవర్‌ విద్యామన్‌ బరామ్డేను ఉద్దేశించి కరోనా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించాడు. ఆయన మాటలను వినిపించుకోకుండా సమీపంలోని చందోరి గ్రామంలో నివసించే సోదరి ఇంటికెళ్లి.. అక్కడి బంధువులను గుంపుగా తీసుకొచ్చి సదరు వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో షాహాజీ పాటిల్‌తోపాటు 24 ఏండ్ల యువకుడు వైభవ్‌ కూడా చనిపోయాడు. కాసర్‌ షిర్షి పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు  చేస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి  తీసుకొన్నట్టు సమాచారం.