National
- Dec 26, 2020 , 07:42:42
గోడ కూలి ఇద్దరు జవాన్లు మృతి, మరొకరికి గాయాలు

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో గోడ కూలి ఇద్దరు జవాన్లు మరణించారు. శుక్రవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కథువాలోని ముచ్చేదిలో జరిగిన ఈ ఘటనలో మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. కథువాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్లావర్ పోలీస్టేషన్ పరిధిలోని ముచ్చేదిలో ఆర్మీ జవాన్లు బ్యారక్‌లో పనిచేస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారిపై గోడ కూలిపడింది. దీంతో సుబేదార్ ఎన్ సింగ్, నాయక్ పర్వేజ్ కుమార్, సిపాయి మంగళ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని బిల్లావర్‌లోని దవాఖానకు తీసుకెళ్లగా, ఎస్ఎన్ సింగ్, పర్వేజ్ అప్పటికే మరణించారని డాక్టర్లు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం మంగళ్ సింగ్‌ను పఠాన్‌కోట్‌కు తరలించారు. మృతిచెందిన ఎన్సింగ్ స్వస్థలం హర్యానాలోని సోనేపట్ కాగా, పర్వేజ్ది సాంబా, గాయపడిన మంగళ్ సింగ్ హర్యానాలోని పానిపట్‌కు చెందినవారు.
తాజావార్తలు
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
- ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్
- కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
- తెలంగాణ ఓటరు జాబితా ప్రకటన..
- మోడీ అనుచరుడికి మండలి సీటు
- స్టాక్స్ ’ఫ్రై’డే: నిమిషానికి రూ.575 కోట్లు లాస్
- పిస్టల్‌తో బర్త్‌డే కేక్ కటింగ్.. వీడియో వైరల్
MOST READ
TRENDING